వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత విమానం కూల్చివేత: పాక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: తన గగనతలంలోకి ప్రవేశించిన భారతవిమానాన్ని కూల్చివేసినట్లు పాకిస్థాన్‌ ప్రకటించుకుంది. భారత-పాకిస్థాన్‌ల ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని అమెరికా విదేశాంగ సహాయ మంత్రి రిచర్డ్‌ ఆర్మిటేజ్‌ ప్రకటన చేసి తర్వాత కొద్ది గంటలకే ఈ సంఘటన జరిగింది. తన గగనతలంలో 14 మైళ్ల లోపల ఈ శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈవిమానాన్ని కూల్చి వేసినట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది.

పరిశీలన కోసం భారత్‌ పంపిన ఈవిమానాన్ని పంజాబ్‌ ప్రొవిన్స్‌లోని ఇండో- పాక్‌ సరిహద్దుల వద్ద రైవిండ్‌- కసూర్‌ రోడ్డు సమీపంలోఫైటర్‌ జెట్‌ కూల్చి వేసినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ రషీద్‌ ఖురేషీ చెప్పారు.విమానం హవేలీ డోగ్రాన్‌ సమీపంలో పడిపోయి మంటల్లో చిక్కుకుందని ఆయన అన్నారు. వెంటనే పాకిస్థాన్‌సైన్యం అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అంతర్జాతీయ నిబంధనలను భారత్‌ ఏ మాత్రం ఖాతరు చేయడం లేదనడానికి ఈ సంఘటన సాక్ష్యమని ఖురేషి వ్యాఖ్యానించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X