• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుజరాత్‌లో మళ్లీ హింస: ఇద్దరు మృతి

By Staff
|

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో సోమవారం తాజాగా చెలరేగిన హింసకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. మరణించినవారిలో ఒక ఆటోరిక్షా డ్రైవర్‌ ఉన్నాడు.

వేజల్పూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని గుప్తానగర్‌, జుహాపురాల్లో ఈ అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఇద్దరు వ్యక్తులు మరణించడంతో పాటు ఎనమండుగురు గాయపడ్డారు. యాభై యేళ్ల ఆటో రిక్షా డ్రైవర్‌ కర్ఫ్యూ అమల్లో ఉన్న వేజల్పూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని గుప్తా నగర్‌ మెయిన్‌ రోడ్డుపై వెళ్తుండగా అతన్ని కత్తులతో పొడిచారు. జుహపూరాలో బుల్లెట్‌ గాయాలతో ఆస్పత్రిలో చేరిన మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. రాళ్లు రువ్వుకున్న సంఘటనల్లో, కత్తిపోట్లతో, పోలీసు కాల్పుల్లో మరో ఎనమండుగురు గాయపడ్డారు.

ఇదే పోలీసు స్టేషన్‌ పరిధిలోని కుముది, అమాజీ ప్రాంతాల్లో దుండగులు డజను ఇళ్లను ధ్వంసం చేయడమో, లూటీ చేయడమో చేశారు. లూటీలకు, విధ్వంసాలకు దిగిన మూకలను చెదరగొట్టడానికి పోలీసులు పలుమార్లు టియర్‌ గ్యాస్‌షెల్స్‌ వదిలారు; కాల్పులు జరిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X