వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలామ్‌ ఎంపిక గొప్పతనం మాదే: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అత్యున్నత రాష్ట్రపతి పదవికి అణు శాస్త్రవేత్త అబ్దుల్‌ కలామ్‌పేరును ప్రతిపాదించి తాము దేశానికి దిశా నిర్దేశం చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ తిరిగి వచ్చిన ఆయన మంగళవారం ఉదయం తన నివాసంలోవిలేకరులతో మాట్లాడారు.

అందరికీ ఆమోదయోగ్యమైనవిశిష్ట వ్యక్తిని ప్రతిపాదించడం ద్వారా దేశానికి దిశా నిర్దేశం చేశామని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ ముందే కలామ్‌పేరును సూచించినప్పటికీ ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారని, తాను రాజకీయంగా ఏకాభిప్రాయాన్ని సాధించగలిగానని ఆయన అన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో, గుజరాత్‌ అల్లర్ల నేపథ్యంలో కలామ్‌ వంటి వ్యక్తిని రాష్ట్రపతి పదవికి ఎన్నుకోవడం వల్ల ప్రపంచం, ప్రజానీకం హర్షిస్తాయని, భారత్‌పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయని ఆయన అన్నారు.

ఏకాభిప్రాయంతో అబ్దుల్‌ కలామ్‌ను రాష్ట్రపతి పదవికి బలపరచాలని ఆయన కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాల నేతలను ఆయనకోరారు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించి ఏకాభిప్రాయ సాధన కోసం ప్రతిపక్షాలు తమ వంతు పాత్ర నిర్వహించి ప్రపంచానికి ఆరోగ్యకరమైన, సానుకూల పవనాలను పంపాలని ఆయన అన్నారు. ఏకాభిప్రాయ సాధనలో రాజకీయ ప్రక్రియవిఫలమైన తరుణంలో తనకు అకస్మాత్తుగా అబ్దుల్‌ కలామ్‌పేరు తట్టిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X