వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్దుల్‌ కలాం హైదరాబాదీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రపతి పదవికి ఎన్‌డిఎ అభ్యర్ధిగా తాను ప్రతిపాదించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం పుట్టింది తమిళనాడులో అయినప్పటికీ ఆయన అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించింది మాత్రం హైదరాబాద్‌లోనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

అబ్దుల్‌ కలాం ఎంపిక జాతికిగర్వకారణమని ముఖ్యంగా హైదరాబాద్‌ ప్రజలకు ఇది ఎంతోగర్వకారణమైన అంశమని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని రక్షణ శాఖపరిశోధనా సంస్థల్లో దశాబ్ద కాలం పైగా కలాం అత్యున్నత హోదాల్లో పనిచేశారు. ఆయన హైదరాబాద్‌లో వుండగానేఅగ్ని, పృథ్వీ, నాగ్‌, ఆకాశ్‌ క్షిపణులు జీవం పోసుకున్నాయి. హైదరాబాద్‌లో వైద్య, ఇంజనీరింగ్‌ రంగాల్లోవిద్యార్ధులకు చౌకగా సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలుఅందుబాటులోకి తెచ్చేందుకు ఒక ప్రాజెక్టును ప్రారంభించాలన్న ఆలోచన కూడా అబ్దుల్‌ కలాంకు వుండేదని ఆయన హైదరాబాద్‌ను బాగా అభిమానిస్తారని చంద్రబాబు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X