వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ది చిన్న ప్రారంభం: ముషార్రఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అబూ దుబాయ్‌: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు బలగాల మోహరింపును తగ్గించాలని భారత్‌ తీసుకున్న చర్య చిన్న ప్రారంభం మాత్రమేనని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ వ్యాఖ్యానించారు. భారత్‌ నుంచి మరింత ఎక్కువ ఆచరణ అవసరమని ఆయన మంగళవారంనాడు అన్నారు.

అమెరికా రక్షణ మంత్రి డోనాల్డ్‌ రమ్స్‌ఫీల్డ్‌ పర్యటనను ఆయన ఆహ్వానించారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్‌ అమెరికాతో సహకరిస్తుందని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌ వాణిజ్యవిమానాలు భారత గగనతలాన్ని వాడుకోవడాన్ని భారత్‌ అనుమతించింది. ఈ స్థితిలోమీరు తీసుకునే చర్యలేమిటని అడిగితే ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్‌ ఇప్పటికే చేయాల్సినదాని కన్నా ఎక్కువ చేసిందని ఆయన సమాధానమిచ్చారు. నిజాయితీతో కూడా చర్యల కోసం తాను ఎదురు చూస్తున్నానని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X