వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్‌ సంస్కరణలు వేగవంతం: రేచల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:విద్యుత్‌ సంస్కరణలను వేగవంతం చేయడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమనిట్రాన్స్‌కో కొత్త చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేచల్‌ ఛటర్జీ చెప్పారు. రమాకాంత్‌ రెడ్డి స్థానంలో ఆమెట్రాన్స్‌కో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈమె ఇంత వరకు వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శిగా పని చేశారు.

విద్యుత్‌ నిర్వహణ, ఆర్థిక సామర్థ్యాలను పెంచడానికి ప్రాధాన్యం ఇస్తానని ఆమె చెప్పారు. కరెంట్‌ బిల్లుల బకాయిల వసూలు చేయడానికి ప్రధానంగా కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు.ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. వినియోగదారులకు ఉత్తమసేవలందించాలని ఆమె అధికారులకు సూచించారు. సంస్కరణలు వినియోగదారులకు ఉత్తమసేవలందించడానికేనని ఆమె చెప్పారు. ఆగస్టు నుంచి గ్రామాలకు 24 గంటలువిద్యుత్తును అందించేందుకు ప్రయత్నిస్తామని రేచల్‌ ఛటర్జీ చెప్పారు. వినియోదగారులకు ఉత్తమసేవలందించాలని ఆమె అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X