వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషమంగానే అంబానీ ఆరోగ్యం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయ్‌ః రిలయన్స్‌ అధినేత ధీరూబాయ్‌అంబానీ పరిస్థితి ఇంకా విషమంగానే వుంది. గత 60 గంటలుగాఅంబానీ బ్రీచ్‌ కాండి ఆస్పత్రిలో కోమాలో వున్నవిషయం విదితమే. ప్రాణాధార పరికరాలపైనే ఆయన పూర్తిగా ఆధారపడి వున్నారనిఅంబానీ కుమారుడు అనిల్‌ అంబానీ చెప్పారు. వైద్య నిపుణులు ఆయనను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాని, గత 24 గంటల్లో పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదనిఅంబాని తెలిపారు.

ఈ నెల 24నఅంబానీ ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. ఆయనకు మొదటి నుంచి వైద్యం చేస్తున్న వైద్య నిపుణులే ఇప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారని, విదేశాల నుంచి ఎవరినీ రప్పించే ఆలోచన లేదని అనిల్‌వివరించారు. ధీరూబాయ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించే వారందరికీ అనిల్‌ కృతజ్ఞతలు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X