• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అక్టోబర్‌ వరకుసైన్యం వుంటుంది: జార్జి

By Staff
|

అహ్మదాబాద్‌: పాకిస్థాన్‌ నుంచి ఇంకా కొద్దిగా చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయని, కనీసంఅక్టోబర్‌ వరకు సైన్యం సరిహద్దుల్లో వుంటుందని రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ చెప్పారు. ఆ తర్వాత సమీక్ష జరిపి పరిస్థిని బట్టిసైన్యాన్ని ఉపసంహరించాలా, వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

చొరబాట్లు ఇంకా కొద్దిగా జరుగుతూనే ఉన్నాయని, సరిహద్దు వెంబడి భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయని,అక్టోబర్‌ వరకు భద్రతా బలగాలు సరిహద్దు వెంబడి వుంటాయని ఆయన గురువారంవిలేకరులతో అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికలు జరిగే వరకు సైన్యాన్ని ఉపసంహరించబోమని, ఆ తర్వాత పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. సీమాంతర ఉగ్రవాదం అణచివేతపై పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ ఇటీవల చేసిన ప్రకటనలను ప్రస్తావించగా ముషార్రఫ్‌ పరస్పరవిరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని, ముషార్రఫ్‌ను నమ్మడానికివీల్లేదని ఫెర్నాండెజ్‌ అన్నారు. ఎన్‌సిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక జాతీయ సమగ్రతా శిబిరంలో పాల్గొనడానికి ఆయన ఇక్కడికి వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X