వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకు రెండు నిమిషాలు: జనా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాను పార్టీ అధ్యక్ష పదవికి అతుక్కుపోవాలని అనుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి అన్నారు. కేంద్ర మంత్రి, పార్టీల పునర్వ్యస్థీకరణకు తన పట్టు వల్ల ఆటంకం కలుగుతున్నదనే వార్తలను కూడా ఆయన త్రోసిపుచ్చారు.

తాను ఒక కార్యాలయానికి లేదా పదవికి అతుక్కుపోవాలనుకునే మనషిని కానని, తాను గవర్నర్‌ పదవిని కాదన్నానని, తాను అధ్యక్ష పదవి చేపట్టాలని కోరుకోలేదని, మంత్రి పదవికి తానుఅంగీకరించలేదని, అది అధ్యక్ష పదవిపై ఉన్న మోజుతో కాదని ఆయనవివరణ ఇచ్చారు. ప్రధాని కోరితే రాజీనామా చేయడానికి తనకు రెండు నిమిషాలు కూడా అవసరం లేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. పార్టీ నిర్మాణం పటిష్టంగా వున్నదని, పార్టీ చురుగ్గా పని చేస్తోందని, పార్టీ పునర్వ్యస్థీకరణ మాట ఎందుకంటున్నారో తనకుఅర్థం కావడం లేదని ఆయన అన్నారు.

ఇంకా ఎక్కువ మంది పార్టీ కోసం పని చేయాలనుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని, దాన్ని ఆహ్వానిస్తానని, అటువంటి వారందరికీ ఇక్కడ చోటు వుంది; పని ఉన్నదని ఆయన అన్నారు. హిందూత్వ ఎజెండాను పక్కన పెట్టడం వల్ల ఇటీవలి ఎన్నికల్లో పార్టీదెబ్బ తిన్నదనే అభిప్రాయాన్ని ఆయన త్రోసిపుచ్చారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ఎజెండానే తమ ఎజెండా అని, వచ్చే ఎన్నికల వరకు ఇదే ఎజెండాతో ముందుకు పోతామని ఆయనస్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X