• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పర్యటనపై ఎమ్మెల్యేలకు బాబు సూచన

By Staff
|

హైదరాబాద్‌: విదేశీ పర్యటన చేసే శాసనసభ్యులు తమ దృష్టినంతా అధ్యయనంమీదే కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. రెండో విడత విదేశీ పర్యటనకు బయలుదేరుతున్న శాసనసభ్యుల సమావేశంలో ఆయన గురువారం ప్రసంగించారు.

ఇటీవల ఒక విడత శాసనసభ్యులు విదేశాల్లో పర్యటించి వచ్చారు. ప్రస్తుతం రెండో విడత పర్యటన కోసం గురువారం బయలుదేరుతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌, బిజెపి శాసనసభ్యులు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. విదేశాల్లోని వాస్తవ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించి, అవి మన రాష్ట్రానికి ఏ మేరకో ఉపయోగపడుతాయో ఆలోచించాలని ముఖ్యమంత్రి శాసనసభ్యులకు సూచించారు. మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని పోవాలో చూడాలని ఆయన అన్నారు.

శాసనసభ సమావేశాలు వచ్చే నెల 15వ తేదీన ప్రారంభమవుతాయని కూడా ఆయన సూచనప్రాయంగా తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నిక ఉన్నందున పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు వచ్చే నెల 15వ తేదీన ప్రారంభమవుతున్నాయని, అదే సమయంలో శాసనసభ సమావేశాలు జరిగితే బాగుంటుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X