హైదరాబాద్‌ః లార్డ్ మైదానంలో భారత యువకిశోరాలు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైనవిజయాన్ని సాధించిన క్షణంలో భాగ్యనగరం ఉప్పొంగిపోయింది. టపాకాయలపేలుళ్ళతో భాగ్యనగరం దీపావళిని తలపించింది. అర్థరాత్రి పూట యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి, కేరింతలు కొడుతూ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. బార్లలో బీర్లు పొంగి పొర్లాయి. యువకులు చివరకు వృద్ధులు కూడా కేరింతలు కొడుతూ వీధుల్లో నాట్యం చేశారు. ఎవరి నోటవిన్నా యువరాజ్, కైఫ్ కబుర్లే... భారత క్రికెట్ కు పట్టిన శని ఇప్పటికైనా వీడిందనే ఆశాభావంతో కూడిన మాటలే. సచిన్ టెండుల్కర్ అవుట్ కాగానే 154 పరుగుల స్కోరు వద్ద 5వికెట్లు కోల్పోవడంతో చాలా మంది టెలివిజన్‌స్విచ్ ఆఫ్ చేసి నీరసంగా పడక ఎక్కారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చాలా ఇళ్ళలో ఫోన్లు గణగణా మోగాయి. మిత్రులు తట్టిలేపడంతో ఉత్సాహంగా లేచి టెలివిజన్‌ఆన్ చేసి అవార్డుల ప్రదానోత్సవాన్ని, హైలైట్స్ ను ఆనందంగావీక్షించిన వారు చాలా మంది వున్నారు. అర్థరాత్రిఅయినా ఫోన్ చేసిన మిత్రులకు మనసులో కృతజ్ఞతలు చెప్పుకోని వారు లేరు.