వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎండిఎంకె నిషేధం

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నైః ఎండిఎంకె నేత వైగో అరెస్టులో రాజకీయం ఏ మాత్రం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్పష్టం చేశారు. ఒక నిషిద్ధ తీవ్రవాద సంస్థకు మద్దతుగా ప్రసంగాలు చేయడం మాత్రమే కాకుండా వైగో దానిని సమర్ధించుకోవడాన్ని ప్రమాదకరమైన ధోరణిగా ఆమె అభివర్ణించారు. వైగో అరెస్టు పూర్తిగా ఆయన స్వయంకృతాపరాధమని ఆమె స్పష్టం చేశారు.

పోటా కింద ఎండిఎంకెను నిషేధించేవిషయం కూడా తాము పరిశీలిస్తున్నట్టుగా ఆమె తెలిపారు. ఎల్‌టిటిఇకి అనుకూలంగా వైగో చేసిన వ్యాఖ్యలను తాను కేంద్ర హోం మంత్రి అద్వానీ దృష్టికి తీసుకువెళ్లినట్టుగా ఆమె వెల్లడించారు. వైగోఅరెస్టుపై బిజెపి అధికార ప్రతినిధి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యల పట్ల ఆమెవిస్మయం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరి ఏవిధంగా వన్నా శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించినఅంశాలైన కారణంగా తాము ఈ విషయంలో రాజీపడే సమస్యే లేదని ఆమె చెప్పారు. నిషిద్ధ సంస్థలకు మద్దతుగా మాట్లాడే ఇతర రాజకీయ పార్టీలు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె హెచ్చరించారు. ఇదిలా వుండగా వైగోను వెల్లూరు జైలుకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఎండిఎంకె కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేయడానికి మాత్రం వైగోకు అనుమతి లభించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X