• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెండో రోజు బంద్‌ ప్రశాంతం

By Staff
|

హైదరాబాద్‌ః ఎన్‌కౌంటర్లకు నిరసనగా పీపుల్స్‌వార్‌ ఇచ్చిన రాష్ట్ర బంద్‌ శుక్రవారం నాడు రెండవ రోజు కూడా పాక్షికంగానే జరిగింది. బంద్‌ సందర్భంగా ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగలేదని పోలీసు వర్గాలు చెప్పాయి. హైదరాబాద్‌ నగరంలో బంద్‌ ప్రభావం రెండవ రోజు కూడా ఏ మాత్రం కనిపించలేదు.

అయితే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణా జిల్లాల్లో బంద్‌ సందర్భంగా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లోని కొన్ని పట్టణాల్లో ముందు జాగ్రత్త చర్యగా దుకాణాలు స్కూళ్లు మూసివేశారు. పోలీసులే రాత్రి నుంచి బస్సులను రద్దు చేశారు. నక్సల్స్‌ ప్రభావ ప్రాంతాలకు బస్సులను నిలిపివేశారు. నిజామాబాద్‌ జిల్లా మద్దికుంట గ్రామంలో పనికి ఆహారం కింద విడుదలైన బియ్యం బస్తాలను లారీలలో తరలిస్తుండగా కామారెడ్డి లోకల్‌ గెరిల్లా స్క్వాడ్‌ నాయకుడు దివాకర్‌ నక్సలైట్లు అడ్డగించి మారుమూల గ్రామానికి తీసుకుని సుమారు 730క్వింటాళ్ల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేశారు. బంద్‌ పిలుపు ఒక రోజూ రెండు రోజులా అనేవిషయంపై వివిధ జిల్లాల్లో సందేహాలు వెలువడ్డాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X