వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లార్డ్స్‌ లో భారత్‌ చారిత్రకవిజయం

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌ః క్రికెటర్లుస్వర్గంగా భావించే లార్డ్స్‌ మైదానంలో భారత క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. ప్రపంచ వన్డే క్రికెట్‌ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును ఛేజ్‌ చేసివిజయం సాధించిన టీమ్‌ గా రికార్డులకు ఎక్కారు. కపిల్‌ దేవ్‌ సారధ్యంలో వరల్డ్‌ కప్‌ సాధించిన తరువాత మళ్ళీ అంతటి ఉత్సాహం ఈ నాటి క్రికెట్‌ టీం లో కనిపిస్తున్నది. 30 ఏళ్ళ లోపు యువఆటగాళ్ళతో తొణికిసలాడుతున్న భారత జట్టు 326 పరుగులు భారీ లక్ష్యాన్ని అలవోకగా సాధించి సత్తా చూపింది. ప్రపంచకప్‌ కు ఏ ఆటగాళ్ళనుసెలక్ట్‌ చేయాలా అని తలలు బాదుకుంటున్నసెలక్టర్లకు చింతలేకుండా చేసింది.

టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ తీసుకుంది. బ్యాట్స్‌ మెన్‌ రెచ్చిపోయి ఆడారు. టిస్కోథెక్‌ మెరుపువేగంతో సంచరీ చేశాడు. ఎప్పుడూ లేనిది ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హుస్సేన్‌ తన తొలిసెంచరీ చేశాడు. ఇంగ్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 325 పరుగలు సాధించింది. ఆ లక్ష్యాన్ని సాధించడం సులువుకాదని జెఫ్రీబాయ్‌ కాట్‌ వంటి క్రికెట్‌ పండితులు కామెంట్రీ బాక్స్‌ నుంచి ఊదరకొడుతునే వున్నారు.

బ్యాటింగ్‌ బరిలోకి దిగిన గంగూలీ మొదటి బంతి నుంచి రెచ్చిపోయాడు. మెరుపువేగంతో 60 పరుగులు చేశాడు. మొదట్లోకాస్త తడబడినా మరో ఓపెనర్‌సెహవాగ్‌ విజృంభించి 40కి పైగా పరుగులు చేశాడు. అయితే భారత్‌ అదృష్టం అక్కడి నుంచి ముఖం చాటు చేసింది. గంగూలీ,సెహవాగ్‌, దినేష్‌ మోంగ్యా, ద్రావిడ్‌, సచిన్‌ వరుసగాపెవిలియన్‌ దారి పట్టారు. 15 ఓవర్లలోనే వందపరుగులకుపైగా సాధించిన భారత్‌ 140 చిల్లర పరుగులకు ఐదు కీలకమైనవికెట్లు కోల్పోయింది. ఇక మిగిలిందల్లా యువరాజ్‌సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌.
వీరిద్దరూ ఏమీ చేయలేరనుకున్న భారత్‌ అభిమానులు నీరసపడిపోయారు. లార్డ్స్‌ మైదానం నిస్తేజం గామారిపోయింది.

ఓ నాలుగు ఓవర్లు నెమ్మదిగా ఆడిన యువరాజ్‌ సింగ్‌ విజృంభించాడు. మెరుపువేగంతో 67 పరుగులు చేశాడు. యువరాజ్‌ ఆడుతున్నంతసేపు నెమ్మదిగా ఆడిన కైఫ్‌ యువరాజ్‌ అవుటుఅయిన క్షణం నుంచి విజృంభించి భారత్‌ కు అసాధ్యం అనుకున్నవిజయాన్ని ఇంకా మూడు బంతులు మిగిలి వుండగానే సాధించిపెట్టాడు.

సచిన్‌ అవుటు కావడంతో విజయం ఖాయం అనుకున్న ఇంగ్లాండ్‌ జట్టు ఆశలనుకైఫ్‌ అడియాశలు చేశాడు. వరుసగా తొమ్మిది టోర్నమెంట్స్‌ లోఫైనల్స్‌ లో పరాజయం పాలై అప్రతిష్ఠ మూటగట్టుకున్న భారత జట్టు ఈ సారి అసాధ్యాన్ని సాధ్యం చేసి చరిత్ర సృష్టించింది. భారత్‌ జట్టు సాధించినవిజయంతో బిసిసిఐ ఆటగాళ్ళకు కోటి రూపాయల నజరానాప్రకటించిందంటే భారత్‌ క్రికెట్‌ కు మంచిరోజులు వచ్చినట్లు కాదా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X