బిజెపిలో నూతనోత్తేజం

Posted By:
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    న్యూఢిల్లీః ఇటీవల ఎన్నికల్లో ఎదురైన పరాజయ పరంపరను పక్కనబెట్టి భారతీయ జనతాపార్టీ కార్యకర్తలకు నూతన ఉత్తేజాన్ని కలిగించి ముందుకు నడిపించేందుకు చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణ ఆశించిన ఫలితాలను ఇస్తున్నదని ఇప్పుడు పార్టీలో అన్ని స్థాయిల్లోనూ ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తున్నదని ఉపప్రధాని, కేంద్ర హోం మంత్రి అద్వానీ చెప్పారు. మంగళవారం నాడు ఆయన పార్టీ పార్లమెంట్‌ సభ్యుల సమావేశంలో ప్రసంగించారు.
    ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చేపట్టిన మార్పుచేర్పులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నదని అద్వానీ చెప్పారు. ప్రధాని ఉత్తేజపూరిత సందేశాలతో పార్టీ శ్రేణులు, ప్రజలు, పారిశ్రామిక వేత్తలు ఆనందోత్సాహలతో వున్నారని అద్వానీ తెలిపారు. ఈ ఉత్సాహం చూసి విపక్షాలు బెదిరిపోతున్నాయనిఅద్వానీ వ్యాఖ్యానించారు. భిన్న వర్గాల ప్రజలను సంతృప్తి పర్చే చర్యల కోసం ఆర్ధిక మంత్రి యశ్వంత్‌సిన్హా పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమవుతారని ఆయన వెల్లడించారు. పెన్షనర్లు, పేదలు, బడుగువర్గాల ప్రజల సమస్యలపై పార్టీ ఎంపీలు తమ అభిప్రాయాలను ఆర్ధిక మంత్రి దృష్టికి తీసుకుపోవచ్చని ఆయన చెప్పారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more