• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎస్‌ఎం కృష్ణతో మాట్లాడుతా: సిఎం

By Staff
|

హైదరాబాద్‌: తుంగభద్ర జలాలవిషయంలో తాను కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణతో చర్చిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ సభ్యులకు హామీ ఇచ్చారు. రాయలసీమకు తుంగభద్ర జలాల విడుదలపై, కర్టాటకలో కృష్ణానదిపై ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచడంపై కాంగ్రెస్‌ సభ్యులు లేవనెత్తినఅంశాలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ ఆ హామీ ఇచ్చారు.

తుంగభద్ర జలాలను కర్ణాటక అక్రమంగా వినియోగించుకుంటోందనేవిషయంపై మంగళవారం శాసనసభలో గంటకుపైగా చర్చ జరిగింది. తుంగభద్ర జలాల విడుదలపై ఎస్‌.ఎం. కృష్ణతో చర్చించడానికి తాను కర్ణాటక వెళ్తానని ముఖ్యమంత్రి చెప్పారు. కర్ణాటకలో తుంగభద్ర, కృష్ణానదులపై ప్రాజెక్టులు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి చెప్పి సరి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ నేతలపై ఉన్నదని ఆయన అన్నారు. ఈవిషయమై ఎస్‌.ఎం. కృష్ణతో చెప్పి సరి చేయాలని అడిగేందుకు సోనియా గాంధీ వద్దకు వచ్చేందుకు తాను కూడా సిద్ధమేనని ఆయన చెప్పారు. తాను రెండు మూడు సార్లు కర్ణాటక ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడానని, కనీసం ఇన్వెస్టిగేషన్‌కు కూడా ఎస్‌.ఎం. కృష్ణ అంగీకరించడం లేదని, తన మాటలను కృష్ణ వినడం లేదని ఆయన అన్నారు. తుంగభద్ర, కృష్ణా జలాల అక్రమ వినియోగంపై కృష్ణతో మాట్లాడడానికి తాము కూడా వస్తామని, ఎప్పుడు కృష్ణతో మాట్లాడుతారో చెప్పాలని ప్రతిపక్ష నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. దీనికి ముఖ్యమంత్రి ప్రతిస్పందిస్తూ తాను అఖిల పక్ష సభ్యులతో కర్ణాటక వెళ్లి మాట్లాడుతానని హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X