వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మిగనూరు ఎత్తిపోతలపై రభస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎత్తిపోతల పధకంపై శుక్రవారం అసెంబ్లీలో పెనువివాదం చెలరేగింది. దళితుల కోసం ఉద్దేశించిన ఈ ఎత్తిపోతల పధకం ఈ రోజున అగ్రవర్ణాల పరం అయిందని కాంగ్రెస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్ల్యే మారప్ప మాట్లాడుతూ రవాణా మంత్రి బి.వి. మోహన్‌ రెడ్డి బంధువులు ఈ ఎత్తిపోతల పథకాన్ని సొంతం చేసుకున్నారని దుయ్యబట్టారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పెనువివాదం చెలరేగింది.

నియోజకవర్గం గురించి ఏ మాత్రం తెలియని ఎమ్మెల్ల్యే ఇలా తనపై ఆరోపణలు చేయడం తగదని బి.వి.మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ తోవిచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి డిమాండ్‌ చేశారు.అందుకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పుష్పరాజ్‌ మాట్లాడుతూ ఇప్పటికీ ఆ రిజర్వాయర్‌ ను కలెక్టర్‌ పరిశీలించారన్నారు. అవసరమైతే మరోసారి పరిశీలించమని కోరతామన్నారు.అందుకు వై.ఎస్‌. ఆగ్రహం వ్యక్తం చేస్తూ.... అవసరమైతేఅంటారమేటి... అవసరమనే కదా డిమాండ్‌ చేసింది అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X