వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణకాంత్‌ అంత్యక్రియలకు బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు.

ఆయన ఆదివారం ఉదయం కృష్ణకాంత్‌ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు, రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా కృష్ణకాంత్‌ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కృష్ణకాంత్‌ మరణం దేశానికి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై కృష్ణకాంత్‌కు ప్రత్యేకాభిమానం ఉండేదని ఆయన అన్నారు. ఆ మరణం రాష్ట్రానికి కూడా తీరని నష్టమని ఆయన అన్నారు. కృష్ణకాంత్‌ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X