వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ ఎన్నిలకపై సలహాలు వద్దు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తీవ్రవాద శిబిరాలను అంతం చేయడానికి పాకిస్థాన్‌ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోనందు వల్ల భారత్‌లోకి చొరబాట్లు ఆగిపోలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నిరుపమా రావు అన్నారు.

భారత్‌ తగిన చర్యలు తీసుకోవడానికి ముందు పాకిస్థాన్‌ చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని తాము వ్యక్తం చేసినట్లు ఆమె ఆదివారంవిలేకరులతో అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్‌ పావెల్‌ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయినే కాకుండా పలువురు నేతలను కలుసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోస్వేచ్ఛగా, నిజాయితీగా ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, అయితే దానికి ముంఉద హింస తగ్గుముఖం పట్టాల్సి వున్నదని ఆమె అన్నారు. ఎన్నికలనుదెబ్బ తీయాలనే ప్రయత్నాలు ఫలించబోవని ఆమె చెప్పారు.

పావెల్‌ పర్యటనను ఇరు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలను నివారించే దృష్టితోనే చూడకూడదని, పావెల్‌ భారత ఉపఖండం పర్యటన వెనక అనేక ఉద్దేశాలున్నాయని ఆమె అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలనేఅంశంపై సలహాలు అవసరం లేదని ఆమె అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి పలికే విషయంలో పాకిస్థాన్‌ తీసుకునే చర్యలమీదనే భారత్‌ చర్చలు జరిపే అంశం ఆధారపడి వుంటుందని ఆమె అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలను హింస ద్వారాదెబ్బ తీయకూడదనే సందేశాన్ని పాకిస్థాన్‌కు స్పష్టంగాఅందజేసినట్లు ఆమె తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికలను స్వతంత్ర పర్యవేక్షకులు పరిశీలించే అవకాశం కల్పించాలని అమెరికా చేసిన డిమాండ్‌ను ఆమె ప్రస్తావిస్తూవిసా ఉన్నవారు ఎవరైనా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పర్యటించవచ్చునని, వ్యక్తిగత హోదాలో ఎన్నికలను కూడా పరిశీలించవచ్చునని అన్నారు. ఎన్నికలను పరిశీలించడానికిస్వచ్ఛంద సంస్థలకు, వ్యక్తుల సమూహానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X