• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైతు ఆత్మహత్య- రాస్తారోకో

By Staff
|

వరంగల్‌: వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట మండలం మన్సాన్‌పల్లి రైతు ఆత్మహత్యకు నిరసనగా కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) కార్యకర్తలు ఆదివారం రాస్తోరోకో నిర్వహించాయి.

ట్రాన్స్‌కో బలవంతపు బిల్లుల వసూళ్లకు తట్టుకోలేక మన్సాన్‌పల్లి రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు.

రాములు మృతదేహాన్ని బచ్చన్నపేటకు తెచ్చి రోడ్డుపై ఉంచి కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.ట్రాన్స్‌కో వేధింపులు భరించలేకనే రాములు ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. రాములు కుటుంబానికిఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, బిల్లుల వసూలుకుట్రాన్స్‌కో నిర్వహిస్తున్న దాడులను ఆపేయాలని వారు డిమాండ్‌ చేశారు. రాములు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X