వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండేళ్లలో పది లక్షల ఇళ్ల స్థలాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వచ్చే రెండేళ్లలోపేదలకు పది లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రెండు రోజుల కలెక్టర్ల ముగింపు సమావేశంలో బుధవారం ఆయన ఈ ఆదేశాలిచ్చారు.

వెనుకబడిన తరగతులవిద్యార్థుల కోసం కొత్తగా జిల్లాకు ఒక హాస్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రకంగా కొత్తగా 23 బిసి హాస్టల్స్‌ వస్తాయని ఆయన చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల్లో ప్రతి ఉద్యోగి పని చేయాలని ఆయన అన్నారు.. ఇందుకు గాను కౌన్సిలింగ్‌ విధానంలో లోటుపాట్లను సవరించనున్నట్లు, వెనుకబడిన ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రమోషన్‌, తదితర సౌకర్యాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లోవిద్యా వాలంటీర్లను నియమిస్తామని ఆయన చెప్పారు.

ఆగస్టు రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న చదువుల పండుగ కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. నిరక్ష్యరాస్యత నిర్మూలన కోసం చేపట్టిన ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి పలు కార్పోరేట్‌ సంస్థలు,స్వచ్ఛంద సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన అన్నారు. అధికారులలో బాధ్యత, జవాబుదారీ తనంపెరగాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X