వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవుసాయం చేస్తాంః చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కరవు బారిన పడిన జిల్లాలకు తప్పకుండా సాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. చదువుల పండుగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయనవిజయనగరం జిల్లాలో పర్యటించారు. విజయనగరం జిల్లా జమ్మిపేట గ్రామంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.విజయనగరం జిల్లాలో కరవు అధికంగా వున్నదని, కరవు తీవ్రతనుఅంచనావేయాల్సిందిగా ఆయన అధికారులనుకోరారు.

గత ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు కరవు సాయం చేస్తామని హామీ ఇవ్వడం ఇదే ప్రధమం. జిల్లా మంత్రిఅశోక గజపతి రాజు తమ ప్రాంతంలో కరవు తీవ్రత గురించి ప్రస్తావించడంతో చంద్రబాబు ఈఅంశాన్ని ప్రస్తావించి, సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆతరువాత జనాభా నియంత్రణ లేకపోవడం వల్లే రాష్ట్రంలోపేదరికం పెరిగిపోతున్నదని, నిరక్షరాస్యత పెరిగిపోవడానికి కూడా అదే కారణం అని ఆయన అన్నారు. కరవు పరిస్థితిని సమర్ధంగా ఎదుర్కొంటాం అని చంద్రబాబు ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X