వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోచ్‌ కావాలనే తపనలేదుః కపిల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరుః భారత్‌ జట్టుకు మరోసారి కోచ్‌ గా బాధ్యతలు చేపట్టే ఆసక్తి లేదని హర్యానా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ అన్నారు. కోచ్‌ పదవి తనకు అంతగా ఆనందం కూడా ఇవ్వదని ఆదివారం జరిగినవిలేకర్ల సమావేశంలో ఆయన చెప్పారు. ఏ బాధ్యతఅప్పగించినా మనసు పెట్టి పనిచేయడం నాకు అలవాటు. ఇప్పటి వరకు క్రికెటర్‌ గా నా ధర్మం నిర్వహించాను... ఇష్టంలేని పని చేస్తే సంతోషంగా వుండదు కదా అని ఆయన అన్నారు. మాక్స్‌ ఛానల్‌ నిర్వహిస్తున్న గల్లీ క్రికెట్‌ కార్యక్రమంలో భాగంగా కపిల్‌ దేవ్‌ పలు పట్టణాల్లో పర్యటిస్తూ చిన్నారులకు క్రికెట్‌ లో మెళకువలు నేర్పుతున్నారు.అందులో భాగంగా ఆయన ఆదివారం బెంగుళూరులోవిలేకర్లతో మాట్లాడారు.

భారత్‌ జట్టుకు విదేశీ కోచ్‌ వుండడంలో తప్పు లేదని, అయితే గ్లామర్‌ కోసం విదేశీ కోచ్‌ లనుపెట్టుకుంటే మాత్రం సమర్ధించలేమని ఆయన చెప్పారు.ప్రస్తుత కోచ్‌ జాన్‌ రైట్‌ పనితీరు ఎలా వుందని ప్రశ్నించగా క్రికెట్‌ మ్యాచ్‌ లను జాగ్రత్తగా గమనిస్తున్న సిద్దు, రవిశాస్త్రిని ఈ ప్రశ్న అడగండి అని కపిల్‌ దేవ్‌ అన్నారు. 1983 మాదిరిగా భారత్‌ జట్టు వచ్చే ఏడు జరిగే వరల్డ్‌ కప్‌ పోటీల్లో జైత్రయాత్ర సాగించగలరని కపిల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X