వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెరవీడని చిట్టిబాబు:సర్వత్రా ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు రెండు పోలీసుస్టేషన్లపై దాడి చేసి తమ వెంట తీసుకెళ్లిన పోలీసు కానిస్టేబుల్‌ చిట్టిబాబును ఇంకా వదిలిపెట్టలేదు. ఈవిషయంలో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది.

చిట్టిబాబు విడుదలకు నక్సల్స్‌ షరుతులుపెట్టలేదు. డిమాండ్లు కూడా పంపలేదు. ప్రజాదర్బారు నిర్వహించి చిట్టిబాబుపై నక్సలైట్లు చర్యలు తీసుకోవచ్చుననే వదంతులు వ్యాపించాయి. దీంతో చిట్టిబాబు కుటుంబసభ్యుల్లో, పోలీసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చిట్టిబాబును నక్సలైట్లు ఎక్కడ దాచారనేవిషయం కచ్చితంగా తెలియడం లేదు. చింతపల్లి అడవుల్లో గానీ, ఆంధ్ర,ఒరిస్సా సరిహద్దుల్లో గానీ చిట్టిబాబును బందీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. చిట్టిబాబు విడుదలకు పోలీసు ఉన్నతాధికారులు లోపాయికారిగా మధ్యవర్తుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చిట్టిబాబు ఏడు ఎన్‌కౌంటర్లలో పాల్గొని శౌర్యపతకాలు కూడా పొందినట్లు సమాచారం. దీంతో నక్సల్స్‌ చెర నుంచి చిట్టిబాబు విడుదల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదిలా వుంటే, చిట్టిబాబు విడుదలకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ హైదరాబాద్‌లోవిలేకరులతో చెప్పారు. చిట్టిబాబును విడుదల చేయాలని ఆయన నక్సల్స్‌కువిజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X