• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడి హత్యకు కుట్ర- ముగ్గురిఅరెస్టు

By Staff
|

న్యూఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి,విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌భాయ్‌ తొగాడియా, ఇతర సంఘపరిహార్‌ ముఖ్యనేతల హత్యకు పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కర్‌-ఎ- తోయిబా కార్యర్తలను ముగ్గుర్నిఅరెస్టు చేసి, వారి నుంచి పెద్ద యెత్తన మారణాయుధాలనుస్వాధీనం చేసుకోవడం ద్వారా ఆ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేయగలిగారు.

ఒక గల్ఫ్‌ దేశంతో సంబంధాలు పెట్టుకుని ఈ ఉగ్రవాదులు గుజరాత్‌లో పట్టు సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు, జిహాదీ పేరిట జరిగే కార్యకలాపాల వైపు గుజరాత్‌ బాధితులను ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఢిల్లీ స్పెషల్‌ పోలీసు కమీషనర్‌(ఇంటలిజెన్స్‌) కె.కె. పాల్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

అహ్మదాబాద్‌కు చెందిన సాహిద్‌ అహ్మద్‌ బక్షీని, ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందినఫర్హాన్‌ అహ్మద్‌ అలీని దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో ఈ నెల28వ తేదీ రాత్రి, హఫీజ్‌ మొహ్మద్‌ తాహిర్‌ను మొరాదాబాద్‌లో శుక్రవారంనాడు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. బక్షీ, అలీల నుంచి నాలుగు కిలోల ఆర్‌డిఎక్స్‌, రెండుడెటనేటర్లు, ఒక చైనా తయారీ పిస్టల్‌, ఒక మాగజీన్‌, 15 లైవ్‌ రౌండ్స్‌నుస్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. లష్కర్‌- ఎ- తోయిబా వ్యూహంలో భాగంగా భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయస్వయం సేవక్‌ సంఘ్‌, విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌లకు చెందిన ముఖ్యనాయకులను హత్య చేయడానికి ప్రత్యేక పథకం రచించినట్లు వారు ఇంటరాగేషన్‌లో వెల్లడించినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X