వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిట్టిబాబును చంపేశాంః వార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నంః తమ వద్ద బందీగా వున్న అనకాపల్లి కానిస్టేబుల్‌ చిట్టిబాబును చంపేసినట్లుపీపుల్స్‌ వార్‌ ప్రకటించింది. పీపుల్స్‌ వార్‌ ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుస్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి బాలకృష్ణ పాడేరులో పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈవిషయం వెల్లడించారు. చిట్టిబాబును ప్రజల అభీష్టం మేరకే చంపేశాంఅంటూ రామకృష్ణ ఆప్రకటనలో వెల్లడించారు.

రాష్ట్రంలో ఇలాంటి పోలీసులు చాలామంది వున్నారు... వారందరికీ ఇదే గతిపడుతుందని రామకృష్ణ హెచ్చరించారు. వారం రోజుల కిందట అనకాపల్లి పోలీస్టేషన్‌ పై దాడి చేసిన నక్సలైట్లు చిట్టిబాబుతో సహా ఐదుగురు పోలీసులను తమ వెంట తీసుకువెళ్ళారు. చిట్టిబాబును తమ వద్దే వుంచుకొనిమిగిలిన నలుగురిని మూడు రోజుల కిందట విడుదల చేశారు. చిట్టిబాబు విడుదల కోసం ప్రభుత్వం పౌరహక్కుల నేతలతో దౌత్యం చేస్తుండగా..... దౌత్యానికి సిద్ధం అని నటిస్తూ చిట్టిబాబును చంపడం పట్లసర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X