వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌ ఆటలు సాగనివ్వం: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: చర్చలపేరుతో బలపడాలనే పీపుల్స్‌వార్‌ నక్సలైట్ల ప్రయత్నాలను సాగనివ్వబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని జూబిలీహాల్‌లో ఏర్పాటయిన రాష్ట్రసీనియర్‌ పోలీసు అధికారుల సమావేశంలో ఆయన బుధవారం ప్రసంగించారు.

తాము నక్సలైట్‌ సమస్యకుశాశ్వత పరిష్కారం కోరుకుంటున్నామని, చర్చలుశాశ్వత పరిష్కారం కోసం జరగాలని, అయితే చర్చలపేరుతో పీపుల్స్‌వార్‌ బలపడే ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. నక్సలైట్లు రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్రమంతటావిస్తరించారని ఆయన అంటూ, ఈ విషయమై అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. నక్సలైట్లు సాయుధపోరాటానికిస్వస్తి చెప్పబోమని చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు. రాష్ట్రంలో ముఠాకక్షలపై, మట్కా, జూదం వంటివాటిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X