• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓజోమెన్‌ కంపెనీపై దాడి

By Staff
|

విజయవాడఃవిజయవాడలోని ఫిజీకెమ్‌ కంపెనీపై ఔషధనియంత్రణ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో 40 లక్షల రూపాయలువిలువ చేసే ఓజోమెన్‌ తదితర ఔషధాలను అధికారులుస్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ సెక్సాలజిస్టు కంభంపాటిస్వయంప్రకాష్‌ సారధ్యంలో ఈ కంపెనీ నడుస్తున్నది.

సెక్స్‌ సామర్ధ్యాన్నిపెంపొందించే ఔషధంగా ఈ ఓజోమెన్‌ కు బహుళప్రచారం కల్పించారు. ఓజోమెన్‌ తో పాటు ఫిజి స్లిమ్‌ వంటి ఆయుర్వేద క్యాప్సుల్స్‌ ను కూడా ఈ కంపెనీ తయారు చేస్తున్నది.

ఈ కంపెనీ ఉత్పత్తుల్లో కొన్ని నిషేధిత ఔషధాలు ఉపయోగిస్తున్నట్లు ఇటీవల ఈనాడు దినపత్రిక ప్రచురించింది. దీంతో ఔషధనియంత్రణ అధికారులు ఈ కంపెనీపై దాడి చేసి స్టాకునుస్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు, ఇంత భారీ స్థాయిలో స్టాకుస్వాధీనం విజయవాడలో సంచలనం సృష్టించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X