• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వై.ఎస్‌.ప్రచారయాత్ర ప్రారంభం

By Staff
|

కర్నూలు: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంవాగ్ధానాల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకుసీఎల్పీ నేత తలపెట్టిన ప్రచారయాత్ర సోమవారంకర్నూలులో ప్రారంభమైంది. తెలుగుదేశం నేతచంద్రబాబు ప్రజాహిత కార్యక్రమాల గురించి ఆలోచించకుండాఅనవసర విషయాలపై దృష్టి సారిస్తున్నాడనివై.ఎస్‌.విమర్శించాడు.

కాంగ్రెస్‌ చేపట్టిన ఈ ప్రచారయాత్రకు విశేష స్పందన లభించింది. 1999లో చంద్రబాబు నాయుడు ప్రారంభించిన గురురాఘవేంద్ర మళ్ళింపు పథకం ప్రాజెక్ట్‌ వద్ద వై.ఎస్‌ తన యాత్రను మొదలుపెట్టారు.ఆయన ఈ శంకుస్థాపన వద్ద మొక్కను నాటారు.

చంద్రబాబు నాయుడు వాగ్ధానాల వైఫల్యానికిగురురాఘవేంద్ర మళ్ళింపు పథకమే ప్రత్యక్షఉదహరణ అని అన్నారు. ఐదువేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. 1300 కోట్లు ఖర్చుపెడుతామని అన్నారు.ఈరెండేళ్ళలో శంకుస్థాపన తప్ప ఇక్కడ మరోపురోగతి లేదు. ప్రభుత్వం శిలాఫలకాలకు మాత్రమేఖర్చుపెడుతోందని ఆయన విమర్శించారు.

అనంతరం ఆయన నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనిప్రసంగించారు. ఎన్నికల అప్పుడు వాగ్ధానం చేసినప్రజాప్రయోజన కార్యక్రమాలను అమలుచేయకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్నినీరుగార్చడమే అవుతుంది. ఎన్నికల సందర్భంగా ఒక్కోజిల్లాలో వందల కొద్ది చంద్రబాబు హామీలు గుప్పించాడు. కానీ ఒక్కటి కూడానెరవేర్చలేదు సరికదా...వాటి ప్రగతి గురించి ఆరా తీసినసందర్భమూ లేదు అని వై.ఎస్‌. విమర్శించారు.

ఈ ప్రచార యాత్రలో పిసిసి అధ్యక్షుడుఎం.సత్యనారయణరావు కూడా పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X