• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రామోజీరావుకు రెండేళ్ళ జైలు

By Staff
|

ఏలూరుః ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు రెండేళ్ళ జైలుశిక్ష, ఐదువేల రూపాయల జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడం అదనపు మేజిస్ట్రేట్‌ తీర్పు చెప్పారు. ఈశిక్షపై అప్పీలు చేసుకొనేందుకు వీలుగా నవంబర్‌ 16 వరకు గడువు ఇస్తూ మేజిస్ట్రేట్‌ సాంబశివరావు సోమవారం సంచలన తీర్పు చెప్పారు. 1992లో పశ్చిమగోదావరి జిల్లా డిసిసిబి చైర్మన్‌ పార్థసారధిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఈనాడు జిల్లా ఎడిషన్‌ లో వార్తలు ప్రచురితమయ్యాయి.

ఈ వార్త కేవలం తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకే రాశారని, ఇందులో వాస్తవం లేదని పార్థసారధి కేసు దాఖలు చేశారు. ఈ వార్త రాసిన ఈనాడు రిపోర్టర్‌ సాయికుమార్‌ కు కూడా ఇదే శిక్షవర్తిస్తుందని న్యాయమూర్తు చెప్పారు.

తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ వార్తపై రిజాయిండర్‌ ప్రచురించాల్సిందిగా పార్థసారధిస్వయంగా రామోజీరావుకు లేఖ రాశారు. అయితే రిజాయిండర్‌ ప్రచురించదలేదు.పైగా 1996లో పార్థసారధి అవినీతిని ఆడిట్‌ అధికారులు ధృవీకరించారని కూడా ఈనాడు ప్రచురించింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాల్సిందిగా పార్ధసారధి కోఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌ నుకోరారు. ఆపై జరిపిన దర్యాప్తులో అభియోగాలు నిరాధానం అని తేలింది. ఈ నివేదికను కూడా పార్థసారధి కోర్టుకు సమర్పించారు. కేవలం ప్రజాప్రయోజనం కోసమే వార్తరాశామని ఈనాడు తరవు న్యాయవాది వాదించారు. నిరాధారమైన వార్తలు ప్రచురించినందుకు రామోజీరావుకు, రిపోర్టర్‌ కు రెండేళ్ళ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X