• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సలేంకు మరణశిక్ష విధించం: అద్వానీ

By Staff
|

భువనేశ్వర్‌: ఆరోపణలు రుజువైతే ముంబాయి వరుస బాంబుపేలుళ్ల కేసులో నిందితుడైన అబూ సలేంకు మరణశిక్ష విధించబోమని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ చెప్పారు. ఈ మేరకు రాతపూర్వకంగా పోర్చుగీస్‌ ప్రభుత్వానికి హామీ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మరణశిక్ష విధించబోమని హామీ ఇస్తేనే అబూ సలేంనుఅప్పగిస్తామని పోర్చుగల్‌ భారత్‌కు తెలియజేసింది. దీంతో అద్వానీ శనివారం ఆ హామీ ఇచ్చారు.

అబూ సలేంను భారత్‌కు తీసుకురావడానికి ఇంటర్‌పోల్‌ సహకారంతో భారత కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) ప్రయత్నాలు చేస్తుందని ఆయన విలేకరులతో చెప్పారు. మూడు నెలల పాటు అబూ సలేం పోర్చుగల్‌లో నిర్బంధంలో ఉంటాడని, ఈ కాలంలో భారత్‌కు అతడ్ని తీసుకురావడానికి ఏర్పాటు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని, అతను చేసిన నేరాలపైవిచారణ జరుగుతుందని ఆయన వివరించారు.

అలా రాతపూర్వకంగా హామీ ఇవ్వడానికి భారత చట్టం అనుమతిస్తుందని అద్వానీ చెప్పారు. అద్వానీ ఈవిషయమై ప్రధాని వాజ్‌పేయితో మాట్లాడారు. హోం, న్యాయ మంత్రిత్వశాఖలుఅందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాయని, త్వరలో సిబిఐ బృందం లిస్బన్‌ బయలుదేరి వెళ్తుందని అద్వానీ చెప్పారు. సిబిఐ ఇచ్చిన పది ఫింగర్‌ప్రింట్స్‌ ఆధారంగా ఇంటర్‌పోల్‌ అబూ సలేంను లిస్బన్‌లోఅరెస్టు చేసింది. అమెరికా నుంచి అబూ సలేం పారిపోయి పోర్చుగల్‌ చేరుకున్నాడని, ఈవిషయం తెలిసిన ఇంటర్‌పోల్‌ సిబిఐకి తెలియజేసిందని, వెంటనే సిబిఐ ఇంటర్‌పోల్‌కు ఫింగర్‌ప్రింట్స్‌ పంపిందని, దాంతో ఇంటర్‌పోల్‌ అతడ్నిఅరెస్టు చేయగలిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అబూసలేం అరెస్టుకు భోపాల్‌ పోలీసులు శుక్రవారంఅరెస్టు వారంట్లు జారీ చేశారు. రెండు కేసుల్లో ఈఅరెస్టు వారంట్లు జారీ అయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X