వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ ఆఫ్రిదీ సెకండ్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ

By Staff
|
Google Oneindia TeluguNews

కొలంబో: ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో సెకండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీని పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ సాహిద్‌ ఆఫ్రిదీ రెండోసారి పూర్తి చేశాడు. హాలండ్‌తో జరిగిన ఐసిసి ఛాంపియన్‌ ట్రోఫీ మ్యాచ్‌లో ఆఫ్రదీ 18 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ను పాకిస్థాన్‌ సునాయసంగా గెలిచింది.

ఈ మ్యాచ్‌లోసిక్సర్‌తో అర్థ సెంచరీ సాధించిన అఫ్రిదీ 18 బంతుల్లోనే 1996లో నైరోబీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోఅర్థ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాకు చెందినసైమన్‌ డొన్నెల్‌ కూడా 18 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. ఇతను 1990లో షార్జాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించాడు. ఫాస్టెస్ట్‌అర్థ సెంచరీలో ఇప్పటికీ శ్రీలంక బ్యాట్స్‌మన్‌ సనత్‌ జయసూర్యదే రికార్డు. జయసూర్య 1996లో సింగపూర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతుల్లోఅర్థ సెంచరీ చేశాడు.

హాలండ్‌ పెట్టిన 136 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్‌ ఒకవికెట్‌ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. మూడుటీమ్‌లో గ్రూప్‌లో శ్రీలంక పాకిస్థాన్‌ను,హాలండ్‌ను ఓడించి ఇప్పటికే సెమీ ఫైనల్‌కుచేరుకుంది. సెమీ ఫైనల్లో శ్రీలంక హాట్‌ ఫేవరెట్‌ఆస్ట్రేలియాతో తలపడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X