వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోఫోర్స్‌లో అవినీతి లేదు: హిందూజాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బోఫోర్స్‌ గన్‌ డీల్‌లో ఏ విధమైన అవినీతి చోటు చేసుకోలేదని ఐరోపాకు చెందిన హిందూజా సోదరులు శుక్రవారం ఢిల్లీ కోర్టులో చెప్పారు. ఆర్మీ ఆమోదం తెలిపిన తర్వాతనే కాంట్రాక్టుకు తుదిరూపు ఇచ్చినట్లు వారు తెలిపారు.

బోఫోర్స్‌ గన్‌ డీల్‌లో ఏ విధమైన అవినీతి లేదు. ఒక వేళ కాంట్రాక్టులో ఏదయినా ఉంటే అది ఆర్మీకి, బోఫోర్స్‌ కంపెనీకి మధ్య చోటు చేసుకున్నదే. కానీ కేంద్ర దర్యాప్తు బృందం(సిబిఐ) ఆరోపించినట్లుగా బోఫోర్స్‌కు, ఇతర నిందితులకు మధ్య చోటు చేసుకున్నది కాదు అని హిందూజాల తరఫు న్యాయవాది రాంజెత్మలానీ ప్రత్యేక న్యాయమూర్తి ప్రేమ్‌ కుమార్‌ ముందు వాదించారు.

హిందూజాలు ఈ కేసులో అమాయకులని, వీరిని తప్పుగా ఈ కేసులో ఇరికించారని ఆయన అన్నారు. వారు ఇందులో పాలు పంచుకున్నట్లుగా ఏ విధమైన సాక్ష్యాలు లేవని ఆయన చెప్పారు. సిబిఐ ఆరోపించినట్లుగా నిందితులు బోఫోర్స్‌ ఏజెంట్లు కాదని, గ్లోబల్‌ బిజినెస్‌ కన్సల్టెంట్లుగా వ్యవహరించారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X