• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జట్టులో శ్రీనాధ్‌ -ఫైనల్‌ కు భారత్‌ రెడీ

By Staff
|

ముంబయ్‌ః బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా వున్న భారత క్రికెట్‌ జట్టు ఆదివారం నాడు శ్రీలంకతో తలపడేందుకు సిద్ధం అవుతున్నది. ఆస్ట్రేలియానువిలక్షణ రీతిలో మట్టికరిపించిన శ్రీలంకను అంత తేలిగ్గాఅంచనా వేయరాదని భారత్‌ ఆటగాళ్ళకు కోచ్‌జాన్‌ రైట్‌ సలహా ఇచ్చాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ లో నెహ్రా వేలికి గాయం కావడంతో అతని స్థానంలో కర్నాటక స్పీడ్‌ స్టార్‌ శ్రీనాధ్‌ ను హుటాహుటిన కొలంబోపంపారు. క్రికెట్‌ బోర్డుపై అలిగిన శ్రీనాధ్‌ వన్డేల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. అయితే అతడ్నిటెస్ట్‌ లకు కూడా ఎంపిక చేయకుండా బిసిసిఐ తన బుద్ధి చాటుకుంది.

అయితే వరల్డ్‌ కప్‌ వరకు శ్రీనాధ్‌సేవలు తీసుకోవాలని కపిల్‌ వంటి సీనియర్లు సూచించారు.పైగా సౌతాఫ్రికా జట్టు మన బౌలింగ్‌ ను చీల్చి చెండాడిన తీరు చూసిన గంగూలీ దాల్మియాతో పోట్లాడి మరీ శ్రీనాధ్‌ ను జట్టులోకి పిలిపించుకున్నాడు. ఇప్పుడు బౌలింగ్‌ విభాగం కూడా పటిష్ఠంగా మారడంతో శ్రీలంకపైవిజయభేరి మోగించి, ఐసిసి ట్రోఫీని కైవసం చేసుకొనేందుకు గంగూలీ బృందం సమాయత్తం అవుతున్నది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఐసిసి ట్రోఫీఫైనల్‌ ప్రారంభం అవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X