వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన రజనీ కాంత్‌ నిరశన దీక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ చేపట్టిన నిరశన దీక్ష ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. రజనీకాంత్‌ తన దీక్షనువిరమించిన అనంతరం పెద్ద యెత్తున తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. దీక్షా శిబిరానికి తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖులు పలువురు వచ్చారు. కమలహాసన్‌,అర్జున్‌, సత్యరాజ్‌, రోజా, తదితరులు పలువురు వచ్చి ఆయనను పలకరించారు. పలువురు రజనీకాంత్‌కు శాలువాలు కప్పారు. పూలదండలు సమర్పించారు. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటకను డిమాండ్‌ చేస్తూ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ ఆదివారం ఉదయం నిరశన దీక్ష ప్రారంభించారు. ఆయన తన నిరశన దీక్షను ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించారు.

తమిళ సినీ పరిశ్రమ యావత్తూ ఇదేఅంశంపై శనివారం నైవేలీలో భారీ ప్రదర్శను, బహిరంగ సభను నిర్వహించింది. తెల్ల కుర్తా,పైజామా ధరించి రజనీకాంత్‌ నిరహార దీక్షకు కూర్చున్నారు. ఆయనతో పాటు నటులువిజయకుమార్‌, అబ్బాస్‌, సంగీత దర్శకుడు గణేష్‌, తదితరులు దీక్షలో కూర్చున్నారు. రజనీకాంత్‌కు శాలువా బహుకరించి, ఆయన మెడలో పూలమాల వేసి మాజీ కేంద్ర మంత్రిపి. చిదంబరం నిరశన దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.

చేపక్‌లోని ప్రభుత్వ అతిధి గృహానికి ఎదురుగా ఏర్పాటయిన దీక్షా శిబిరానికి బయలుదేరే ముందు రజనీకాంత్‌ తన నివాసంలోవిలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తాను నిరశన దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చలన చిత్ర దర్శకుడు భారతీరాజా తనను ద్రోహి అనడంపై ఆయన స్పందిస్తూ ఉద్రేకంతో భారతీరాజా ఆ మాటలు అని ఉంటారని, అయితే అదిసరైంది కాదని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X