• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విభక్తమైన అవిభక్త కవలలు

By Staff
|

గుంటూరు: ప్రపంచంలోనే అరుదైన శస్త్ర చికిత్సను గుంటూరు వైద్యులు విజయవంతంగా నిర్వహంచారు. గుంటూరుకు చెందిన రేఖ-సురేఖ అనే అవిభక్త కవలలిద్దరిని ప్రఖ్యాత పిడియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ నాయుడమ్మ అధ్వర్యంలోని వైద్యబృందం శస్త్ర చికిత్స ద్వారా వేరుచేసింది. అత్యంత అరుదైన ఈ చికిత్సను గుంటూరు ప్రభుత్వాసుపత్రి బృందం బుధవారం విజయవంతంగా నిర్వహించింది.

పుట్టుకతోనే పొత్తికడుపు అతుక్కొని పుట్టిన కంజాయిన్డ్‌ ట్విన్స్‌ రేఖ-సురేఖలు. 1998లో పుట్టిన వీరు డాక్టర్‌ నాయుడమ్మ సంరక్షణలో పెరుగుతున్నారు. వైద్య పరిభాషలో ఇస్కియో ఫ్యాగస్‌ గా పరిగణించే ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయని నాయుడమ్మ తెలిపారు.

ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి పది కేసుల్లో శస్త్ర చికిత్సలు జరగగా, కేవలం నాలుగు మాత్రమే విజయవంతమయ్యాయని అన్నారు. ఇప్పుడు వీరు నిర్వహించిన ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఇదొక రికార్డుగా భావిస్తున్నారు.

బుధవారం ఉదయం నలుగురు సర్జన్లుతో సహా పది మంది వైద్యుల బృందం అధ్వర్యంలో శస్త్ర చికిత్స జరిగింది. పదిగంటలకు ప్రారంభమైన చికిత్స సాయంత్రానికి పూర్తయ్యింది. మరో 24 గంటల పాటు వీరిని ఇంటెన్సివ్‌ కేర్‌ లో ఉంచుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X