• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విద్యుత్‌ పై బాబు, వై.ఎస్‌ వాదనలు

By Staff
|

హైదరాబాద్‌: ఉచిత విద్యుత్‌ ప్రజాకర్షక స్లోగనా? ఆర్థిక విధానమా? ఉచిత విద్యుత్‌ నిజంగా వర్క్‌ అవుటయ్యే విధానమేనా? రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి బుధవారం వేరు సందర్భాల్లో తమ అభిప్రాయాలను వెల్లడించారు.

పద్నాలుగు రాష్ట్రాల్లో చేస్తే మేమూ చేస్తాం: నాయుడు
పాపులిస్ట్‌ విధానాలకు కాలం చెల్లింది. పోనీ..కాంగ్రెస్‌ పాలిస్తున్న పద్నాలుగు రాష్ట్రాల్లో అమలు చేయమని చెప్పండి. మేం కూడా కళ్ళు మూసుకొని ఉచిత విద్యుత్‌ అందిస్తాం. ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ ఇలాంటి ఛీప్‌ వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం సరికాదు.
ప్రజాకర్షణ కాదు..పక్కా ఆర్థిక విధానం : వై.ఎస్‌.
రైతులకు మాత్రమే ఉచిత విద్యుత్‌ అంటున్నాం. కానీ అందరికీ అని చెప్పడం లేదు కదా. ఉచిత విద్యుత్‌ అనేది ప్రజాకర్షక పథకం అంటున్నారు. కానీ ఇది పక్కా ఆర్థిక విధానం. రైతులను ఆదుకోవడం అనేది అన్ని ప్రభుత్వాల ధర్మం. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా రైతులకు రకారకాల సబ్సిడీలు ఇస్తున్నాయి.

రాష్ట్రంలో మొత్తం విద్యుత్‌ వినియోగంలో వ్యవసాయరంగం 300 కోట్ల రూపాయల విద్యుత్‌ ను వినియోగించుకుంటోంది. ట్రాన్స్‌ కో ఆదాయంలో ఈ మొత్తం మూడు శాతం మాత్రమే. దీన్ని ప్రభుత్వం భరిస్తే చాలు..రైతుల కష్టాలు తీరినట్లే.. (ఆధారం: పిటిఐ)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X