వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజర్‌కు కోచింగ్‌ బాధ్యతలు

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌కు భారత క్రికట్‌ సంస్థలో పునరావాసం లభించనుంది. అజరుద్దీన్‌ అంగీకరిస్తే ముంబాయిలోని భారత క్రికెట్‌ క్లబ్‌ (సిసిఐ)లో కోచ్‌ అవుతాడు.

అజర్‌కు కోచింగ్‌ ఆఫర్‌ను త్వరలో ఇస్తామని సిసిఐ ఛీఫ్‌ రాజ్‌ సింగ్‌ దుంగార్పూర్‌ ఇక్కడి ఈడెన్‌ గార్డెన్స్‌లో శుక్రవారం విలేకరులతో చెప్పారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అజర్‌ను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ) జీవితకాలం నిషేధించింది. సిసిఐలో బ్యాటింగ్‌ ట్రెయినీలకు కోచింగ్‌ ఇవ్వాలని అజర్‌ను కోరుతామని దుంగార్పూర్‌ చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో అజర్‌ ఒకరని, యువ బ్యాట్స్‌మెన్‌ అజర్‌ నుంచి ఎంతో నేర్చుకోగలరని, ట్రెయినీలకు శిక్షణ ఇవ్వాలని అజర్‌ను అడుగుతామని ఆయన చెప్పారు. దుంగార్పూర్‌ మొదటి నుంచి అజర్‌కు అనుకూలంగా ఉన్నారు. అజర్‌పై నిషేధం ఎత్తేయాలని కూడా ఇంతకు ముందు ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X