• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దక్షిణాకోస్తాలో భారీ వర్షసూచన

By Staff
|

చెన్నై: ఆంధ్రప్రదేశ్‌ లోని దక్షిణ జిల్లాలైన నెల్లూరు, చిత్తూరులలో మరో రెండు రోజులుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా నెల్లూరు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురువారం కొద్దిగా ఎడతెరపి ఇచ్చినా, శుక్రవారం నుంచి సోమవారం వరకు మళ్ళీ భారీగా వర్షాలు పడుతాయని చెన్నైలోని వాతావరణ శాఖ హెచ్చరించింది.

లోతట్టు ప్రాంతాల వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. చెన్నైలో శుక్రవారం తెల్లవారుఝామున మొదలైన భారీ వర్షానికి నగరం అంతా జలమయమైంది. రోడ్లంతా నీరు నిండిపోవడంతో నగరప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు ఈ ఉదయం నానా ఇబ్బంది పడ్డారు. చెన్నై ఎగువ ప్రాంతాలు, ఆంధ్రా ప్రాంతాల్లో వర్షాలు ఇంకా పడుతాయని అక్కడి వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X