• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాకు ప్రత్యామ్నాయం లేదు: వెంకయ్య

By Staff
|

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో డజను మంది తిరుగుబాటు శాసనసభ్యుల వల్ల ఉత్పన్నమైన సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. బిఎస్‌పి- బిజెపి సంకీర్ణ ప్రభుత్వానికి ప్రత్నామ్నాయం లేదని ఆయన శుక్రవారంనాడు అన్నారు.

బిఎస్‌పి-బిజెపి సంకీర్ణం మాత్రమే స్థిర ప్రభుత్వాన్ని అందించగలదని, వీరికి ఆ సమర్థత, బలం ఉన్నాయని ఆయన విలేకరులతో అన్నారు. పార్టీ నేతలు కల్‌రాజ్‌ మిశ్రా, రాజ్‌నాథ్‌ సింగ్‌, కుశభావ్‌ ఠాక్రే పరిస్థితిన గమనిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం కొనసాగాలని, పార్టీ ప్రతిష్ట దెబ్బ తినకూడదని, క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. బిజెపి శాసనసభపక్ష నాయకుడు లాల్‌జీ టాండన్‌పై చర్య తీసుకోవాలని అసమ్మతివాదులు చేసిన డిమాండ్‌ను ప్రస్తావించగా అటువంటి డిమాండ్స్‌పై మిడియా ప్రతినిధుల సమావేశాల్లో చర్చించబోమని కటువుగా సమాధానమిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X