వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్‌ 25 నుంచిఅరకు ఫెస్టివల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఏటా నిర్వహించే అరకు ఫెస్టివల్‌ ను ఈ సారి డిసెంబర్‌ 25 నుంచి నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన అరకు ప్రాంతంలో అత్యధికంగా గిరిజనులు నివసిస్తారు. ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు కలిగిన ఈ గిరిజనుల సంస్కృతిని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో అరకు ఫెస్టివల్‌ ను నిర్వహిస్తున్నారు. అలాగే తరిగిపోతున్న అటవిసంపద గురించి ప్రజల్లో చైతన్యం తీసుకునేందుకు ఈ ఫెస్టివల్‌ ఉపయోగపడుతుందని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.

ఈ ఏడాది అరకు ఫెస్టివల్‌ ను భారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వ ఉన్నతాధికారులు శనివారం విశాఖపట్నంలో సమావేశమై చర్చించారు. ఫెస్టివల్‌ కోసం ప్రభుత్వం ఈ ఏడాది 2 కోట్ల రూపాయలను కేటాయించిందని అధికారులు తెలిపారు.

అటవీశాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహించే ఈ ఫెస్టివల్‌ కు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌ నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X