• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యుద్ద విమానం కూలి 5గురి మృతి

By Staff
|

అంబాలా: భారతీయ వైమానిక దళానికి చెందిన యుద్దవిమానం ఒకటి హర్యానాలోని అంబాలా నివాసప్రాంతంలో మంగళవారం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. అంబాల కంటోన్మెంట్‌ నుంచి బయలుదేరిన ఈ యుద్ద విమానం మూడు కిలోమీటర్లు ప్రయాణించక ముందే ఆనంద్‌ విహార్‌ లోని కాలనీలో కుప్పకూలింది.

రెండు ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పైలట్‌ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. శిథిలాల్లో ఇంకా చాలామంది చిక్కికొని ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సాయంత్రం నాలుగు గంటలకు గాలిలోకి లేవగానే విమానంలో మంటలు చెలరేగాయాని వారు చెప్పారు. దీంతో పైలెట్‌ చేతిలో విమానం అదుపుతప్పి నివాస ప్రాంతాలపై కుప్పకూలింది. విమాన శకలాలు వంద మీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X