వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాగ్వార్‌ బ్లాక్‌బాక్స్‌ లభ్యం

By Staff
|
Google Oneindia TeluguNews

అంబాలా: అంబాలాలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో కూలిపోయిన జాగ్వార్‌ బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైంది. దీని వల్ల ప్రమాదానికి గల కారణాలేమిటో తెలుసుకోవచ్చు.

ఈ ప్రమాదంలో కూలిపోయిన రెండు ఇళ్ల శిథిలాల్లో భారత వైమానిక దళం అధికారులు ఈ బ్లాక్‌ బాక్స్‌ను కనుక్కున్నారు. ప్రమాదంలో వెన్నెముక దెబ్బ తిన్న పైలట్‌ రెహానీ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అతని పరిస్థితిపై సమాచారం ఇవ్వడానికి వైమానిక దళ అధికారులు నిరాకరిస్తున్నారు.

ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు హర్యానా ప్రభుత్వం లక్ష రూపాయలేసి సహాయం ప్రకటించింది. గాయపడి అంబాలా, చండీఘర్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఇళ్లు కూలిపోయినవారికి జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X