• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశం ఎమ్మెల్యే పద్మావతి రాజీనామా

By Staff
|

హైదరాబాద్‌: మాజీ మంత్రి జాగర్లమూడి పద్మావతి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి శుక్రవారం ఉదయం పంపించినట్లు సమాచారం.

జిల్లా అడ్‌హాక్‌ కమిటీ కన్వీనర్ల నియామకాల వ్యవహారంలో అసమ్మతి జ్వాలలు పద్మావతి రాజీనామాతో గుప్పుమన్నాయి. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అడ్‌హాక్‌ కమిటీ కన్వీనర్‌గా ముక్కు కాశిరెడ్డి స్థానంలో బత్తులబ్రహ్మానందరెడ్డిని నియమించడంతో జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి చెలరేగింది. ఈ మార్పునకు అసంతృప్తి చెందిన పద్మావతి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఆమె రెండేళ్లు చంద్రబాబు మంత్రివర్గంలో పని చేశారు. అనారోగ్యకారణాలను సాకుగా చూపుతూ ఆమె తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపినట్లు వినికిడి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X