వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిడ్స్‌ విస్తరణపై బాబు ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో గత ఆరు నెలల కాలంలో ఎయిడ్స్‌ వ్యాధి వ్యాపిస్తుండడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రెండో రోజు శనివారం కలెక్టర్ల సమావేశంలో ఆయన ఎయిడ్స్‌ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

ఎయిడ్స్‌ వ్యాధిని తరిమికొట్టడానికి నడం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎయిడ్స్‌ వ్యాధిని గుర్తించడంలో, నివారణ చర్యలు చేపట్టడంలో అలసత్వం ప్రదర్శించారంటూ ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలకాలంలో హెచ్‌ఐవి పాజిటివ్‌ కేసులుపెరిగాయని, ముప్పయి యేళ్ల లోపు వయస్సున్నవారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులకు సంబంధించి అధికారుల వద్ద జిల్లాలవారీగా సమాచారం లేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడ్స్‌ వ్యాధిపై ప్రజల్లో అవగాహననుపెంచి వారిని చైతన్యవంతులను చేయాలని ఆయనకోరారు. ఎయిడ్స్‌వ్యాధిపై కృష్ణా జిల్లా కళాశాలల్లో, పాఠశాలల్లో చేపట్టిన ప్రచారాన్ని ఇతర జిల్లాలు ఆదర్శంగా తీసుకోవచ్చునని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X