వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోరితే, విడుదలకు సాయం: జయ

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: బందీపోటు వీరప్పన్‌ చెరలో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి నాగప్ప విడుదలలో తమ సాయాన్ని కర్ణాటక ప్రభుత్వం కోరితే సహకరిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. వారు అడిగితే, మా సహాయ, సహకారాలుంటాయని ఆమె గురువారం చెన్నైలో విలేకరులకు చెప్పారు. నాగప్ప విడుదల విషయంలో ఇంతవరకు తమ ప్రభుత్వంతో కర్ణాటక ఎటువంటి సంప్రతింపులు జరపలేదని జయలలిత తెలిపారు.

కనీసం సమాచారాన్ని కూడా అందివ్వడం లేదు. తమిళనాడు అడవుల్లోకి గానీ వీరప్పన్‌ వస్తే, మా తడాఖా చూపుతామని ఇప్పటికే స్పష్టం చేశాం. కలిసి పనిచేద్దామని కర్ణాటక కోరితే అందుకు సిద్దమని ఆమె వివరించారు. కర్ణాటక ఉదాసీన వైఖరి తనకు అంతుచిక్కడం లేదని ఆమె ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణకు చురకలు అంటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X