• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుజరాత్‌ ప్రభావం మాపై ఉండదు

By Staff
|

రాంఛీ: గుజరాత్‌ లో విజయంపై ఇప్పటివరకు ధీమాగా ఉన్న బిజెపి ఇప్పుడు కొంచెం సంశయిస్తోంది.విజయంపై బిజెపిలో విశ్వాసం కాస్తా సడలింది. ప్రధాని వాజ్‌పేయి తో పాటు ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ కూడా దీనిపై ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నారు.

గుజరాత్‌ ఎన్నికల ఫలితాల ప్రభావమేదీ కేంద్రప్రభుత్వంపై పడదని ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ శుక్రవారం స్పష్టం చేశారు. రాష్ట్రాల ఎన్నికలు కూడా ప్రధానమైనవేఅయినప్పటికీ వాటి ప్రభావమేదీ కేంద్రంపై పనిచేయదని ఆయన రాంఛీలోవిలేకరులతో అన్నారు.

ప్రధాని వీఎచ్‌ పీ యాత్రపై శుక్రవారం ఓ టీవీ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చినప్పటికీ అద్వానీ ఈవిషయమై వ్యాఖ్యానించేందుకు తిరస్కరించారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రాజ్యంబద్ద సంస్థ నిర్ణయాలపై వ్యాఖ్యానించడం సబబు కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X