• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరో లష్కర్‌ తీవ్రవాది హతం

By Staff
|

హైదరాబాద్‌: గురువారం హైదరాబాద్‌ లో జరిగిన స్కూటర్‌ బాంబు దాడిలో అనుమానితుడు, లష్కర్‌ తోయిబాకు చెందిన మరో తీవ్రవాది ఆదివారం ఉదయం కరీంనగర్‌ లో జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో మరణించాడు. ఈ సంఘటనవివరాలను డిజిపి పేర్వారం రాములు హైదరాబాద్‌ లోవిలేకరులకు తెలియచేశారు. కరీంనగర్‌ పట్టణ శివార్లలోని రేకూర్తి గ్రామం వద్ద పోలీసులు సోదా నిర్వహిస్తుండగా నిందితుడు అజీజ్‌ అలియాస్‌ ఇమ్రన్‌ పట్టుబడ్డాడు.

సైకిల్‌ మీద వెళ్తున్న అజీజ్‌ ను అనుమానించి పోలీసులు అతన్ని నిలదీయగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. వెంటనే అతను తన దగ్గరున్న రివాల్వర్‌ తో పోలీసులపై కాల్పులు జరిపినట్లు డిజిపివివరించారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అజీజ్‌ అక్కడికక్కడే మరణించినట్లు ఆయన తెలిపారు. పాకిస్థాన్‌ లో తీవ్రవాద శిబరాల్లో అజీజ్‌ శిక్షణ పొందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X