• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మూడో మిలిటెంట్‌ హతం

By Staff
|

జమ్మూ: జమ్మూ నగరంలో రఘునాథాలయంలో కిరాతకానికి పాల్పడిన మూడోమిలిటెంట్‌ సోమవారం ఉదయం హతమయ్యాడు. రఘునాథ ఆలయంలోకి ప్రవేశించి 12 మందిని బలిగొన్నమిలిటెంట్లలో ఇద్దరు ఆలయం వెలుపల ఆదివారం హతమయ్యారు. సోమవారం మరణించినమిలిటెంట్‌ వీరి అనుచరుడని పోలీసులు భావిస్తున్నారు.

పంజ్‌భక్తర్‌ హోటల్‌ వద్దమిలిటెంట్లకు, భద్రతాబలగాలకు మధ్య సోమవారం ఉదయం కాల్పులు ప్రారంభమయ్యాయి. హోటల్‌ నుంచి ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో గుర్తు తెలియనిమిలిటెంట్లు పలుమార్లు కాల్పులు జరిపారు. వెంటనే పోలీసు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇరు పక్షాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నగరంలోకి ప్రవేశించిన ఐదుగురుమిలిటెంట్ల ఆదివారం రాత్రి ఇద్దరు, సోమవారం ఉదయం ఒకరు హతమయ్యారు. ఇంకా ఇద్దరు బతికి ఉన్నట్లు సమాచారం.
రఘునాథ ఆలయంలోకి మిలిటెంట్లు ప్రవేశించి దారుణానికి పాల్పడిన అనంతరం ఆదివారం రాత్రి నగరంలో విధించిన కర్ఫ్యూ కొనసాగుతోంది.మిలిటెంట్ల దాడిలో 12 మంది మరణించారు. మరో 52 మంది గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X