• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉదార వైఖరికి బహుమతి: విహెచ్‌పి

By Staff
|

అహ్మదాబాద్‌: జమ్మూలోని రఘునాథాలయంపై తీవ్రవాదుల దాడినివిశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) సోమవారం ఖండించింది. ఆలయంపై దాడి కాంగ్రెస్‌-పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి) సంకీర్ణ ప్రభుత్వం తీవ్రవాదుల పట్ల అనుసరిస్తున్న ఉదార వైఖరికి బహుమతి అని విహెచ్‌పి వ్యాఖ్యానించింది.

ఆదివారంనాటి తీవ్రవాదుల దాడి వరుస దేవాలయాలపేల్చివేతకు మిలిటెంట్లు వేసుకున్న పథకంలో భాగమని విహెచ్‌పి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ తొగాడియా అభిప్రాయపడ్డారు. సరిహద్దు వెలుపలి నుంచి దీనికి ప్రోత్సాహం లభిస్తోందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా దాడి చేశారు. ధర్మానికి వ్యతిరేకంగాజిహాదీ వార్‌లో భాగంగానే రఘునాథాలయంపై దాడి జరిగిందని ఆయన అన్నారు.

హిందూ రాజ్యంగా కాకుండా హిందూ జాతిగా ఏకం కావాల్సిన, ఇస్లామిక్‌జిహాదీకి బుద్ధి చెప్పడానికి మన యువతకు కమెండో వార్‌ఫేర్‌లో శిక్షణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. దేవాలయాలకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వంవిఫలమైందనే విమర్శను ఆయన ఖండిస్తూ దేవాలయాలన్నిటి వద్ద భద్రతా సిబ్బందిని నియోగించడం అసాధ్యమని ఆయన అన్నారు. భారత్‌ ఇజ్రాయెల్‌ మాదిరిగా తయారు కావాలని, యువతకు కమెండ్‌ శిక్షణను అనివార్యం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X